Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వయాగ్రా ఎక్కువగా వాడితే ప్రాణానికే ప్రమాదమా?

వయాగ్రా ఎక్కువగా వాడితే ప్రాణానికే ప్రమాదమా?

వార్త 3 months ago

Viagra side effects: నేటి కాలంలో ఒత్తిడి వల్ల చాలా మంది పురుషులు లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారం కోసం డాక్టర్లను సంప్రదించకుండా నేరుగా మందుల షాపుల్లో వయాగ్రా కొని వాడుతున్నారు.

ఇలా చేయడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. అవగాహన లేకుండా ఈ మందులు వాడితే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read also: Natural beauty tips: మొటిమలు తగ్గడానికి టూత్‌పేస్ట్‌ వాడొచ్చా?

 Sildenafil medicine mechanism explained

Viagra side effects: వయాగ్రా వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే

ఈ మాత్రలు వేసుకున్నప్పుడు రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, కళ్లలో మంటగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందిలో విపరీతమైన తలనొప్పి, చెవుల్లో వింత శబ్దాలు రావడం మరియు నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి చిన్న సమస్యలే అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చూపు కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు.

వీరు అస్సలు వాడకూడదు.. చాలా డేంజర్!

గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె కోసం మందులు వాడేవారు వయాగ్రా వాడితే సడన్ హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బీపీ, షుగర్ ఉన్నవారిలో రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి వారికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా కిడ్నీలు పాడయ్యే ముప్పు ఉంటుంది. మీ వయస్సు, బరువును బట్టి డాక్టర్ ఎంత మోతాదు తీసుకోవాలో చెప్తారు. అందుకే సొంత వైద్యం మానుకొని ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఒకేసారి ఐదుకు పైగా మందులు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha