Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు.. స్విగ్గీ ఎండీపై నాన్ బెయిలబుల్ వారెంట్

వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు.. స్విగ్గీ ఎండీపై నాన్ బెయిలబుల్ వారెంట్

వార్త 3 days ago

Kurnool Consumer Court: కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఒక సంచలన ఆదేశం ఇచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఎండీపై కోర్టు సీరియస్ అయింది.

ఈ క్రమంలో జారీ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. గతేడాది డిసెంబరులో కర్నూలుకు చెందిన ఒక కస్టమర్ స్విగ్గీ యాప్ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులోని న్యూ అప్సరా హోటల్ నుంచి డెలివరీ బాయ్ తెచ్చిన ఆ ఫుడ్ తింటుండగా అందులో చికెన్ ముక్కలు కనిపించాయి. దీనితో సదరు కస్టమర్ తీవ్ర మనస్తాపానికి గురై న్యాయం కోసం వెంటనే జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

Read also: BJP Andhra Pradesh: బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి'

 Swiggy MD Non Bailable Warrant

కోర్టు ఆదేశాలు లైట్ తీసుకున్న స్విగ్గీ యాజమాన్యం

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కర్నూలు వినియోగదారుల ఫోరమ్ గతేడాది డిసెంబరు 31న ఒక కీలక తీర్పు ఇచ్చింది. కస్టమర్ ఎదుర్కొన్న ఇబ్బందికి నష్టపరిహారంగా 50 వేల రూపాయలు, అలాగే కోర్టు ఖర్చుల కింద మరో 5 వేల రూపాయలు చెల్లించాలని స్విగ్గీ సంస్థను ఆదేశించింది. కానీ ఆన్లైన్ యాప్ నిర్వాహకులు ఈ ఆదేశాలను అస్సలు పట్టించుకోలేదు. బాధితుడికి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారు. దీనితో కోర్టు సదరు సంస్థకు పలుమార్లు నోటీసులు పంపింది. అయినా సరే యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Kurnool Consumer Court: కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్

చివరిగా మే 21న గురువారం నాడు తమ ముందు ఖచ్చితంగా హాజరుకావాలని కోర్టు గడువు విధించింది. అయినా సరే స్విగ్గీ యాప్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టుకు రాలేదు. ఈ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల కమిషన్ బెంగళూరులోని స్విగ్గీ ఎండీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే న్యూ అప్సరా హోటల్ మేనేజర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ ఘటన నిరూపించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha