Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెక్కి వెక్కి ఏడ్చిన మిల్లర్.. అసలేం జరిగిందంటే?

వెక్కి వెక్కి ఏడ్చిన మిల్లర్.. అసలేం జరిగిందంటే?

వార్త 2 months ago

David Miller: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, మ్యాచ్ చివరలో తాను చేసిన ఒక చిన్న పొరపాటు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మైదానంలోనే కన్నీరు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Shubman gill ipl record : ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

David Miller: ఉత్కంఠ రేపిన చివరి ఓవర్

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించింది. గుజరాత్ టైటాన్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్ కీలక దశలో రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.

అయితే.. తాను చేసిన తప్పుకు గ్రౌండ్‌లోనే డేవిడ్ మిల్లర్ ఎంతో కుమిలిపోయాడు. కన్నీరు సైతం పెట్టుకున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ఆఫీసియల్ ఎక్స్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పంచుకుంది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం జట్టును ఓడించిందన్న బాధలో ఉన్న మిల్లర్‌ను కోచ్ హేమంగ్ బదానీ ఓదార్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విజయంతో టైటాన్స్ తమ మూడో ప్రయత్నంలో పాయింట్ల ఖాతా తెరువగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుని నిరాశలో మునిగిపోయింది.

అసలేం జరిగిందంటే?

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ అప్పటికే 20 బంతుల్లో 41 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఐదో బంతికి సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్‌కు స్ట్రైక్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. తానే మ్యాచ్ ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో డేవిడ్ మిల్లర్ పరుగు తీయడానికి నిరాకరించాడు. కానీ చివరి బంతిని డేవిడ్ మిల్లర్ కనెక్ట్ చేయలేకపోవడంతో రన్ కోసం ప్రయత్నించడంతో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగుతో ఓడిపోయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విరాట్ కోహ్లీతో పోలికా? బాబర్ ఆజం సీరియస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha