Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం!

వేలేరుపాడులో ఘోర అగ్ని ప్రమాదం!

వార్త 1 week ago

Velairpadu Fire Accident: వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర అగ్ని ప్రమాదంలో వలగాని సావిత్రి (60), సిగ పూలమ్మ (64) సజీవ దహనమై మృతి చెందారు.

ప్రమాదం జరిగిన సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో నివాస గృహంతో పాటు అక్కాచెల్లెళ్లు అగ్నికి ఆహుతయ్యారు. గృహానికి ఆడుకొని ఉన్న లక్ష్మి నివాస గృహం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.అప్పటికే ఇద్దరు కాలి భూడిదైనట్లు గ్రామస్తులు గమనించారు.

Read also: Rayadurgam Tumakuru Railway: రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం పావగడ పూర్తి !

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం-ఎమ్మెల్యే చిర్రి

ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధ్యులెవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Velairpadu Fire Accident: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పి

ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) సుశ్మిత మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు సంఘటన జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ఘటనపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు పురోగతి, సేకరించిన ఆధారాలు, తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

మృతదేహాలు అప్పగింత

మృతదేహాలకు పోస్ట్‌మార్టం ప్రక్రియను వైద్యులు పూర్తి చేశారు.ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పరీక్షలు నిర్వహించి,అవసరమైన నమూనాలను సేకరించారు.పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలను నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha