Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

వార్త 2 weeks ago

Veligonda Project First Phase : తీవ్ర కరవు, ఫ్లోరైడ్ సమస్యలతో అల్లాడుతున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ముప్పై ఏళ్ల కల సాకారమైంది.

నల్లమల అటవీ ప్రాంతంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద ఉన్న ఫీడర్ కెనాల్ ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి, కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆవిష్కరించి, స్థానిక రైతులతో కలిసి బటన్ నొక్కి గేట్లు ఎత్తడం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు. 1996 మార్చి 5న తన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, తిరిగి 30 ఏళ్ల తర్వాత తన చేతుల మీదుగానే తొలి దశను ప్రారంభించడం ఒక అరుదైన చారిత్రక ఘట్టంగా నిలిచింది.

Read Also: AIG Hospitals Vizag: విశాఖలో ఏఐజీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

 Veligonda Project First Phase

Veligonda Project First Phase : వెలిగొండ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు

ఈ ప్రాజెక్ట్ తొలి దశ అందుబాటులోకి రావడం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలు నల్లమలసాగర్‌లో నిల్వ కానున్నాయి. దీనివల్ల తొలివిడతగా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన సుమారు 4 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. భవిష్యత్తులో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తయితే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి సురక్షితమైన తాగునీరు అందుతుందని, దీంతో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ రహిత వాతావరణం ఏర్పడి వలసలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం తెలిపింది. వెలిగొండ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు వస్తున్నాయి. కాల్వల ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలు నల్లమల సాగర్‌లో నిల్వ చేయనున్నారు. లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీటి సదుపాయం లభించనుంది.

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha