Adarsha Kutumbam Movie: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్, గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది.
వరుస వాయిదాలతో సతమతమవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ పూర్తి స్పష్టతనిచ్చారు. అయితే, ఈసారి తనదైన శైలిలో చమత్కార వ్యాఖ్యలు జోడించి, విడుదల తేదీ ప్రకటన బాధ్యతను నేరుగా హీరో వెంకటేశ్‌కే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
Garividi Lakshmi Twitter Review: గరివిడి లక్ష్మీ మూవీ ట్విట్టర్ రివ్యూ
Release date for Venky’s ‘Adarsha Kutumbam’ finalized?
Adarsha Kutumbam Movie: నేను చెబితే జనాలు నమ్మరు: నాగవంశీ సెటైర్లు
‘జైలర్ 2’ విజయోత్సవ ప్రెస్ మీట్ సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’ విడుదల గురించి నాగవంశీ మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లే సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి వస్తుందని పరోక్షంగా ధ్రువీకరించారు. అయితే, గతంలో డేట్లు మారిన నేపథ్యంలో తనపై తానే సెటైర్లు వేసుకుంటూ.. “గతంలో సినిమా వాయిదా వేసినప్పుడు, అక్టోబర్ 30న వస్తున్నారా అని మీడియా మిత్రులు అడిగారు. మీరు ఊహించిన తేదీకే సినిమా రావడం ఖాయం. కానీ, ఈసారి ఆ తేదీని నేను అధికారికంగా ప్రకటించను. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో, ఇప్పుడు మళ్లీ నేనే చెబితే జనాలు నమ్మరు, పైగా తంతారేమో” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో ప్రెస్‌మీట్‌లో నవ్వులు పూశాయి.
అక్టోబర్ 21న ట్రైలర్ లాంచ్.. డేట్ అనౌన్స్ చేయనున్న వెంకటేష్!
ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు నాగవంశీ వివరించారు. ప్రస్తుతం వెంకటేశ్ గారు ఊటీలో వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారని, ఆయన హైదరాబాద్‌కు తిరిగి రాగానే అక్టోబర్ 21 లేదా 22 తేదీల్లో భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆ వేదికపైనే స్వయంగా వెంకటేశ్ గారే అభిమానుల సమక్షంలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని స్పష్టం చేశారు. గతంలో అక్టోబర్ 2, ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 30న రావడం దాదాపు ఖాయం కావడంతో వెంకీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Epaper: epaper.vaartha.com
కావ్య మారన్ వివాహానికి చంద్రబాబు, లోకేశ్‌ను ఆహ్వానించిన మారన్ కుటుంబం

