Fridge water : వేసవి కాలంలో ఎండల తీవ్రతకు ఫ్రిజ్ నీళ్లు తాగడం తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ,రంతరం ఫ్రిజ్ నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.రీరం సరిగ్గా పనిచేయడానికి నిర్దిష్ట అంతర్గత ఉష్ణోగ్రత అవసరం.
మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మనం చల్లటి నీరు తాగిన వెంటనే ఆ చల్లదనం జీర్ణరసాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి, జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణంకాక, కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
Read Also : Mosquito sticks side effects: ఆ దోమల అగరుబత్తులు ప్రాణాంతకం.. కొనేముందు ఇది చెక్ చేసుకోండి!

Health problems will arise.
Fridge water : కొవ్వును కరిగించకుండా నిరోధిస్తుంది
మనం తినే ఆహారంలోని నూనెలు, కొవ్వులు చల్లటి నీటితో కలిసినప్పుడు గడ్డకడతాయి. దీనివల్ల పేగుల లోపలి గోడలు గట్టిపడి, మలవిసర్జన కష్టమవుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాకుండా చల్లటి నీళ్లు శరీరం కొవ్వును కరిగించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. వేగస్ నాడి అనేది మన మెదడును, జీర్ణాశయాన్ని అనుసంధానించే ఒక ముఖ్యమైన నాడి. అధికంగా చల్లటి నీళ్లు తాగినప్పుడు, ఈ నాడి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా తగ్గడానికి దారితీస్తుందని తాజా పరిశోధనలో తేలింది. దీనితో పాటు గొంతు నొప్పి, టాన్సిల్స్, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి.

Health problems will arise.
'బ్రెయిన్ ఫ్రీజ్'
Fridge water : రిఫ్రిజిరేటర్‌లోని నీటిని నేరుగా తాగడం వల్ల గొంతులోని కఫం గట్టిపడుతుంది. దీనివల్ల శ్వాస మార్గాలు మూసుకుపోయి గొంతు నొప్పి, దగ్గు, సైనస్, గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి.కొంతమందికి చల్లటి నీళ్లు తాగిన వెంటనే తలనొప్పి వస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'బ్రెయిన్ ఫ్రీజ్' అంటారు. ఇది మెదడులోని సున్నితమైన నరాలను చల్లబరచడం ద్వారా తల వెనుక లేదా ముందు భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.దంతాలు బలహీనంగా ఉన్నా లేదా దంతాల ఎనామెల్ క్షీణించినా చల్లటి నీళ్లు తాగిన వెంటనే జిల్ అని అనిపిస్తుంది. క్రమంగా పంటి నొప్పికి దారి తీస్తుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం దాహం తీర్చుకోవడానికి ఫ్రిజ్‌లో ఉంచిన నీటి కంటే మట్టి కుండలో ఉంచిన నీటిని తాగడం మంచిది. మట్టి కుండలోని నీళ్లు సహజంగా చల్లబరచడమే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

