Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన - కేసు నమోదు

విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన - కేసు నమోదు

వార్త 3 weeks ago

Vikarabad Crime : వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పులే గురుకుల పాఠశాలలో దారుణ సంఘటన వెలుగుచూసింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ మెగావత్ నరేశ్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read Also: Kanpur Crime : ఇంట్లో సీసీటీవీ నిఘా..పనిమనిషితో కలిసి మామను హతమార్చిన కోడలు

 Vikarabad Crime

Vikarabad Crime : సంఘటన వివరాలు

కుమారుడిని పరామర్శించేందుకు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే సదరు మహిళతో ప్రిన్సిపల్ నరేశ్ పరిచయం పెంచుకున్నాడు. మంగళవారం విద్యార్థిని కలిసేందుకు పాఠశాలకు వచ్చిన మహిళతో మాట్లాడిన అనంతరం, ప్రిన్సిపల్ ఆమెను తన కారులో తీసుకెళ్లాడు. అగ్గనూర్ శివారు ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని వెంటనే తన బంధువులకు తెలియజేయడంతో, ఆగ్రహానికి గురైన ఆమె బంధువు ప్రిన్సిపల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలితో పాటు ప్రిన్సిపల్ వర్గం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు యాలాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha