Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాటలు.

విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాటలు.

వార్త 2 weeks ago

Devarakadra News: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.

దేవరకద్ర మండలం గురకొండ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

Read Also : Harish Rao: రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన: హరీష్‌ రావు

 Paving a golden path for students’ futures…

Devarakadra News: ఏ ఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేదా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా కార్పొరేట్ పాఠశాలలో లభించే స్థాయి విద్య సౌకర్యాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య

విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధన తత్వాన్ని పెంపొందించడంలో ఏ ఐ ల్యాబ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే చేరుకున్నారు. పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రయోగాత్మకంగా అర్థం చేసుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఏ విషయంలోను ప్రవేట్ పాఠశాలల విద్యార్థుల కంటే వెనుక పడకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి దూకుడు శ్రీను, ఎంఈఓ బలరాం, మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, గురకొండ సర్పంచ్ దాసరి చిన్నమ్మ ఉషనప్ప, పంచాయతీ కార్యదర్శి రఘు, ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమనాథ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

పాపన్నపేట స్కూళ్లో కలకలం.. ఉపాధ్యాయుడిపై 'బ్యాడ్ టచ్' ఆరోపణలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha