Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం నేటి నుంచి అమలు

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం నేటి నుంచి అమలు

వార్త 2 weeks ago

Breakfast scheme: సుదీర్ఘ వేసవి సెలవుల తరువాత తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించింది.

'బ్రేక్‌ఫాస్ట్ స్కీం' ప్రారంభం - విద్యార్థులకు పోషకాహార అల్పాహారం

ఈసారి విద్యార్థులకు చదువుతో పాటు ఉదయం అల్పాహారం అందించే కొత్త 'బ్రేక్‌ఫాస్ట్ స్కీం'ను ప్రభుత్వం ఇవాళ్టినుంచే అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని రోజువారీగా అందించనున్నారు.

Read also: Congress Party : తెలంగాణ లో వెనుకటి రోజులు తీసుకొచ్చిన కాంగ్రెస్ - KTR

Breakfast scheme: వారానికి ప్రత్యేక మెనూ - ఆరోగ్యకరమైన టిఫిన్ ప్లాన్

ప్రభుత్వం వారంలో ఆరు రోజులకు భిన్నమైన టిఫిన్ మెనూను రూపొందించింది:

  • సోమవారం: దోసె-చట్నీ లేదా చపాతీ-కర్రీ, పాలు
  • మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, రాగి జావ
  • బుధవారం: పూరి-ఆలూ కర్రీ, పాలు
  • గురువారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, రాగి జావ
  • శుక్రవారం: ఉప్మా లేదా పొంగల్-చట్నీ, పాలు
  • శనివారం: బోండా-చట్నీ, రాగి జావ

రోజుకు మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ ఇవ్వడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించనున్నారు.

కొత్త పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు మరియు రెండు జతల యూనిఫాంలు అందించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు కొత్త వస్తువులతో ఆనందంగా పాఠశాలలకు హాజరయ్యారు. ఉదయం అల్పాహారం, కొత్త పుస్తకాలు, యూనిఫాంలతో బడులు ప్రారంభం కావడంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సుమారు రూ.540 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, పాల సరఫరాకు అదనంగా రూ.150 కోట్లు వ్యయం అవుతుంది. మొత్తం విద్యా సంవత్సరానికి దాదాపు రూ.720 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఇద్దరం కలిసి 'OG' చూద్దాం.. నిరంజన్ కు పవన్ హామీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha