Manchu Manoj on Vijay: తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. వామపక్షాలు, వీసీకే మద్దతు తెలపడంతో టీవీకే అధినేత విజయ్ 118 అనే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నారు.
దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ పంచుకున్నారు.
Read Also: Dhurandhar 2 OTT Release Date: ఓటీటీలోకి 'ధురంధర్ 2'..భారత్ లో కాదు!
Manchu Manoj on Vijay: ఎగతాళి చేసిన చోటే సత్తా చాటారు: మనోజ్ ప్రశంసలు
విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి మనోజ్ స్పందిస్తూ.. “ఎవరినైతే అన్ని విధాలా ట్రోలింగ్ చేశారో, ఎగతాళి చేశారో, ప్రతి అడుగులోనూ అడ్డుకున్నారో.. సరిగ్గా ఆ వ్యక్తే తన మొట్టమొదటి ఎన్నికల్లోనే సత్తా ఏంటో నిరూపించారు” అని కొనియాడారు. ప్రజల తీర్పే అత్యున్నత శక్తి అని, మార్పు కోసం ప్రజలు ఏకమైనప్పుడు చరిత్ర గతి మారుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
లావణ్య మెరిసింది.. కథ నెమ్మదించింది!

