Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'విజయ్ అను నేను ' అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం

'విజయ్ అను నేను ' అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం

వార్త 3 months ago

టీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మెజారిటీ మార్కుకు స్వల్ప దూరంలో నిలిచినప్పటికీ.. కాంగ్రెస్ (5), సిపిఐ (2), సిపిఎం (2), విసికె (2), ఐయూఎంఎల్ (2) వంటి పార్టీలు విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించాయి. దీంతో బలం 121కి చేరి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 60 ఏళ్లకు పైగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ విజయ్ సాధించిన ఈ విజయం భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also : బెంగాల్ సీఎంగా సువేందు అధికారి!

రేపే ప్రమాణ స్వీకారం – వేడుకకు ముస్తాబు

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది. ‘విజయ్ అను నేను’ అంటూ ఆయన చేసే ప్రమాణాన్ని వినేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. రేపు కేవలం విజయ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మంత్రుల కూర్పుపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం నాడు మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తమిళ రాజకీయాల్లో చారిత్రక మలుపు

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న విజయ్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు, అవినీతి రహిత పాలన అందిస్తానని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేయగా, కొత్త ప్రభుత్వంపై అటు తమిళ జనం, ఇటు రాజకీయ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒక నటుడిగా ‘దళపతి’గా పిలవబడే విజయ్, ఇప్పుడు పాలకుడిగా తమిళనాడును ఏ దిశగా నడిపిస్తారో వేచి చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకోబోయిన సీనియర్ నేత.. వీడియో వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha