Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ పార్టీకి షాక్.. ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ!

విజయ్ పార్టీకి షాక్.. ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ!

వార్త 2 months ago

TVK Vijay: దళపతి విజయ్ రాజకీయాల్లో సంచలనం.. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

దీంతో మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి గట్టి పోటీ ఇవ్వాలని భావించిన విజయ్ వ్యూహాలకు గండి పడింది. తన అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడమే కాకుండా, ఆయన అదృశ్యం కావడం విజయ్ అభిమానులను, పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.

రాజకీయాల్లోకి రావడం ఒకెత్తయితే, అక్కడి క్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడం మరో ఎత్తు. కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు ఉండాలనే చిన్న నియమాన్ని పాటించకపోవడంతో ఎడప్పాడి టీవీకే అభ్యర్ధి అరుణ్ కుమార్ నామినేషన్ వీగిపోయింది. సాంకేతిక లోపాలు, వివరాల అస్పష్టత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల యుద్ధ భూమిలోకి కత్తి పట్టకుండానే విజయ్ సైన్యం ఓటమిని అంగీకరించినట్లయింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి నిత్యా నామినేషన్ కూడా ఇదే కారణంతో రిజెక్ట్ అవ్వడం పార్టీలోని అజాగ్రత్తను ఎత్తి చూపుతోంది.

Read Also: Tamil Nadu Elections 2026: విజయ్ రాకపోయినా విగ్రహంతో నామినేషన్

 ‘Edappadi’ shock for Vijay’s party.. Candidate’s nomination rejected

TVK Vijay: తహసీల్దార్ కార్యాలయం వద్ద హైడ్రామా

మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థి అరుణ్ కుమార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఒత్తిడికి గురయ్యారా? అన్న అనుమానాలతో కార్యకర్తలు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అభ్యర్థికి భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత, అరుణ్ కుమార్ వలసైయూర్‌లోని తన నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద విజయ్ రాజకీయ అరంగేట్రంలో ఎడప్పాడి స్థానం దక్కకపోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో క్రమశిక్షణే ముఖ్యం: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha