తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇప్పుడు అందరి దృష్టి 'దళపతి' విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) వైపే ఉంది. పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లోనే విజయ్ ప్రభంజనం సృష్టించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు కొంచెం దూరంలో ఆగిపోవడంతో పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో ‘రాహుల్ + విజయ్’ అంటూ బీహార్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమనే సంకేతాలు ఇవ్వడం, రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టం చేస్తోంది.
Read Also : విజయ్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా ?

మ్యాజిక్ ఫిగర్ దిశగా టీవీకే ప్రయాణం
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్క్ 118. ప్రస్తుత ఫలితాల ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే ఆ సంఖ్య 113కి చేరుతుంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 సీట్ల అవసరం ఉంది. కేవలం 10 సీట్ల దూరంలో మెజారిటీ ఉన్న టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభిస్తే, అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది కానుంది.
కింగ్ మేకర్ల వేట: చిన్న పార్టీలతో చర్చలు?
మెజారిటీకి అవసరమైన మిగిలిన 5 సీట్ల కోసం విజయ్ ఇప్పుడు చిన్న పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో పట్టున్న PMK, CPI, లేదా VCK వంటి పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే వ్యూహకర్తలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు భిన్నంగా ఒక కొత్త ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని చూడాలని తమిళ ప్రజలు ఆకాంక్షిస్తున్న తరుణంలో, ఈ చిన్న పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, దళపతి విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

