CM Vijay Divorce Case: తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ అత్యంత సంచలనం రేపుతున్న ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విడాకుల కేసు విచారణ నేడు (సోమవారం) కీలక దశకు చేరుకుంది.
గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి విచారణకు వస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు టీవీకే (TVK) పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also :Bapatla Train Robbery: బాపట్ల వద్ద రైలు దోపిడీ దొంగల బీభత్సం!
చెంగల్పట్టు కోర్టులో నేడు విచారణ - ముఖ్యాంశాలు
Chengalpattu Court to Hear Sangeetha's Petition Today
ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు నేడు విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా ఇరువురు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సంగీత తన పిటిషన్‌లో విజయ్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. విజయ్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. తమ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని, మానసిక వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న సంబంధంపై కూడా ఆమె ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విజయ్ ఆర్థిక హోదాకు తగినట్లుగా భరణంతో పాటు, చెన్నై నీలంకరైలో ఉన్న వారి ప్రస్తుత నివాసంలోనే తాను ఉండే హక్కును కల్పించాలని ఆమె కోరారు.
వర్చువల్ విచారణా? వ్యక్తిగత హాజరా?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని ఆయన తరపు న్యాయవాదులు గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురు ప్రముఖులు కావడంతో కోర్టు ప్రాంగణంలో రద్దీ ఏర్పడే అవకాశం ఉందని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ (Virtual Hearing) ద్వారా విచారణకు అనుమతించాలని కోరారు. నేటి విచారణలో కోర్టు వీరి వ్యక్తిగత హాజరుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
CM Vijay Divorce Case: రాజీ ప్రయత్నాలు నిజమేనా?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విజయ్-సంగీత జంట తిరిగి కలిసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే విచారణ ప్రక్రియ జాప్యం అవుతోందని చర్చ సాగుతోంది. అయితే, ఈ వార్తలపై అటు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి కానీ, ఇటు సంగీత తరపున కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

