Roja Comments on Vijay Victory: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన విజయంపై వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు.
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తమిళనాడులో విజయ్ సాధించిన విజయాన్ని ఒక ‘అద్భుతం’గా రోజా అభివర్ణించారు.
గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు రాజకీయాల్లో చరిత్ర సృష్టించినప్పటికీ.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి, సినిమాలను వదులుకుని, ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగా పోరాడి గెలవడం అసాధారణమని కొనియాడారు. కేవలం మాస్ ఫాలోయింగ్ మాత్రమే విజయ్ గెలుపునకు కారణం కాదని, విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు వంటి క్లాస్ ఓటర్లు కూడా మార్పు కోరుకుంటూ టీవీకేకు ఓటు వేశారని ఆమె విశ్లేషించారు. అన్నా డీఎంకే ఓట్లు మాత్రమే కాకుండా, అధికార డీఎంకే ఓట్లను కూడా విజయ్ చీల్చగలిగారని రోజా పేర్కొన్నారు.
Read Also : Kalyandurg Municipality Scam: మున్సిపాలిటీలో భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలు!
Roja Comments on Vijay Victory
తమిళనాడు నుంచి ఆహ్వానాలు.. కానీ వైసీపీతోనే నా పయనం
తమిళనాడు కోడలిగా తనకు అక్కడి రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉందని రోజా గుర్తు చేసుకున్నారు. జయలలిత బతికున్న సమయంలోనే తనను తమిళనాడు నుంచి పోటీ చేయాలని కోరారని, తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నుంచి కూడా తనకు ఆహ్వానం అందినట్లు ఆమె వెల్లడించారు.
అయితే, తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను సొంత చెల్లిలా చూసుకుంటారని, తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ గారిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“ఈరోజు దేశంలో నాకు ఎక్కడ గౌరవం లభిస్తున్నా దానికి కారణం జగన్ గారే. ఆయనపై నమ్మకంతోనే నా రాజకీయ ప్రయాణం సాగుతుంది” అని రోజా తేల్చి చెప్పారు. తమిళనాడులో ఎటువంటి రాజకీయ మార్పులు వచ్చినా, తన విధేయత మాత్రం ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్ మోహన్ రెడ్డికే ఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు. దీంతో గత కొద్దిరోజులుగా ఆమె పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

