Vijayawada municipal contractors:విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నేటి నుంచి విజయవాడ మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె బాట పట్టారు.
ఈ సమ్మె నిర్ణయం వల్ల నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాయన ఆదిబాబు, అధ్యక్షుడు చనుమోలు వెంకట రమణ ఆధ్వర్యంలో ఈ సమ్మె నోటీసులు అందించడం జరిగింది.
Vijayawada Municipal Contractors’ Strike
పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత
నగర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఫండ్ ద్వారా జూలై 31 వరకు రూ.350 కోట్లు, కంటింజెండ్ బిల్లులు రూ.40 కోట్లు, ఇతరత్ర రూ.10 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉన్నాయని వారు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల పనులు నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు.
Vijayawada municipal contractors:అభివృద్ధి పనుల బహిష్కరణ నిర్ణయం
పెండింగ్ బిల్లులు చెల్లించనందున సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా కొత్త పనులను సైతం పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నామని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం మునిసిపల్ శాఖ మంత్రి పొంగుూరు నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషాలను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.
Epaper: epaper.vaartha.com

