Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం.. కేటీఆర్‌

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం.. కేటీఆర్‌

వార్త 3 weeks ago

KTR Tributes to Chakali Ailamma: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ చూపిన తెగువ తెలంగాణ ధీరత్వానికి నిదర్శనమని, బహుజనుల పోరాట పటిమకు ఆమె ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

Read Also : Hyderabad Ganesh festival: ఖైరతాబాద్ మహా గణపతికి డైరెక్ట్ బస్సు సౌకర్యం?

 The struggles and sacrifices of the heroic Chakali Ailamma are unforgettable - KTR.

KTR Tributes to Chakali Ailamma: కేసీఆర్ పాలనలో లభించిన గౌరవం

చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేలా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఆమె జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. అలాగే పాలకుర్తి మార్కెట్ యార్డుకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు, ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె చూపిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha