Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విషాదం.. నిజామాబాద్ జిల్లాలో టీటీసీ విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్య

విషాదం.. నిజామాబాద్ జిల్లాలో టీటీసీ విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్య

వార్త 3 months ago

Nizamabad News: మక్లూర్ మండలంలోని కల్లాడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన శ్రీవాణి అనే యువతి తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

టీటీసీ చదువుతున్న ఈ విద్యార్థిని ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

Read also: Anantha Babu Case: ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

 Uproar in Kalladi: Srivani Commits Suicide

Nizamabad News: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘోరం

కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో శ్రీవాణి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సమయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చేతికి అందొచ్చిన కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సరదాగా ఈత కోసం వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha