Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం

వార్త 6 days ago

Vizag Steel Plant Accident: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2) విభాగంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

ల్యాడిల్ కుప్పకూలడంతో ముంచెత్తిన ఉక్కు ద్రవం

స్టీల్ మెల్టింగ్ షాప్-2 విభాగంలో కన్వేయర్ సహాయంతో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మరుగుతున్న ఉక్కు ద్రవం (హాట్ మెటల్) ల్యాడిల్స్‌ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ల్యాడిల్స్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో, అందులోని ద్రవం అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పడింది. తీవ్రమైన వేడి కారణంగా ఎనిమిది మంది కార్మికులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సమీపంలో ఉన్న మరికొందరు తీవ్ర అగ్ని గాయాలపాలయ్యారు.

Read also: Gooty Petrol Bunk: గుత్తిలో రూ. 95 లక్షలతో పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ!

Vizag Steel Plant Accident: సహాయక చర్యలు ముమ్మరం.. విచారణకు ఆదేశం

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్లాంట్ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫైర్ ఫైటర్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఊహించని ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణాలపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha