Visakhapatnam: బంగాళాఖాతంలో అల్పపీడన తీవ్రత కారణంగా సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఈ వాతావరణ మార్పుల వల్ల విశాఖపట్నం తీరం నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోనే గల్లంతయ్యారు.
ఈ నెల 1వ తేదీన వీరంతా కలిసి ఒకే బోటుపై విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి ఉపాధి కోసం సముద్రంలోకి ప్రయాణమయ్యారు.

read also: Botsa Satyanarayana: హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ
తీరానికి వస్తామన్నారు.. అంతలోనే ఫోన్లు స్విచ్ఛాఫ్
సముద్రంలో అలల ఉద్ధృతి పెరగడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సదరు మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించారు. శనివారం మధ్యాహ్నానికల్లా తాము సురక్షితంగా తీరానికి చేరుకుంటామని వారు కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, రాత్రి దాటినా బోటు హార్బర్‌కు రాకపోవడం, అటు వారి మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో (కనెక్ట్ కాకపోవడంతో) మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Visakhapatnam: గల్లంతైన వారి వివరాలు.. రంగంలోకి సహాయక బృందాలు
సముద్రంలో చిక్కుకుపోయిన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు ఉన్నారు. వీరితో పాటు భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నం పరిధికి చెందిన చిన్న అమ్మోరు ఈ బోటులో ప్రయాణించినట్లు గుర్తించారు. మత్స్యకారులు గల్లంతైన సమాచారం అందుకున్న మత్స్యశాఖ, కోస్ట్‌గార్డ్ అధికారులు అప్రమత్తమయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ప్రకాశ్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: జనసేన నేత కిరణ్ రాయల్

