Vishaka Crime : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీలో గుండె పగిలే విషాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న మల్లా వినోద్‌కుమార్ (ప్రవీణ్) అనే వ్యక్తి తన భార్య అహల్య, ఇద్దరు పసిబిడ్డలతో (మూడేళ్ల రితిక్ష, ఏడాదిన్నర హన్విక) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు పాల్పడే ముందు వినోద్ తన కుటుంబ సభ్యులకు మొబైల్ ద్వారా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సమాచారం అందించడంతో పాటు సోషల్ మీడియాలో “RIP” అని స్టేటస్ పెట్టాడు. మెసేజ్ చూసిన బంధువులు హుటాహుటిన ఇంటికి చేరుకునేసరికే నలుగురూ ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా పడి ఉన్నారు. వినోద్ తన భార్య, ఇద్దరు పసిపాపలకు బలవంతంగా విషం ఇచ్చి చంపిన అనంతరం, తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Peddamma Temple: పెద్దమ్మ గుడి వద్ద విషాదం.. కొత్త కారు పూజకు వచ్చిన వ్యక్తి మృతి
Vishaka Crime
Vishaka Crime : రాఖీ పండుగ వేళ విషాదం
రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులతో రాఖీ కట్టించుకుని సంతోషంగా గడిపిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరగడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

