Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

వార్త 1 week ago

Medical Student Suicide: విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న శైలజ అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

రామ్‌నగర్‌కు చెందిన శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Read Also :Khammam News: అయ్యో ఎంత పని జరిగింది.. విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి

ఇంట్లోనే విషాద ఘటన

శైలజ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకున్నట్లు సమాచారం. అనంతరం తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నట్లు సమాచారం.

Medical Student Suicide: చదువు ఒత్తిడే కారణమా?

శైలజ చదువుకు సంబంధించిన ఒత్తిడి కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం వినిపిస్తోంది. అయితే ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. వైద్య విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ములుగు జిల్లాలో బస్సు-బొలెరో ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha