Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విట్టు నాయక్ తండాలో ఆకస్మిక తనిఖీలు

విట్టు నాయక్ తండాలో ఆకస్మిక తనిఖీలు

వార్త 0 months ago

Vittu nayak thanda:గ్రామ అభివృద్ధి పనుల పరిశీలన.. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని విట్టు నాయక్ తండా గ్రామ పంచాయతీలో ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యటించారు.

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, డీపీఓ మల్లారెడ్డి, మెప్మా పీడీ గీత బృందం గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను, విద్యాబోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీలను వారు స్వయంగా పరిశీలించారు.

Turmeric price: పసిడిలా మెరుస్తున్న పసుపు.. క్వింటా రూ.19 వేలు

Vittu nayak thanda:అంగన్వాడీ కేంద్రాల పరిశీలన

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి-పొడి చెత్త విభజన, డంపింగ్ యార్డుల నిర్వహణ పద్ధతులను పర్యవేక్షించారు. గ్రామంలో ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై స్థానిక అధికారులతో చర్చించి వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో కృష్ణకుమార్, సర్పంచ్ చందర్, ఉపసర్పంచ్ చౌహాన్ రూప్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి సందీప్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సద్గుణ, ఏపీవో గణేష్, పలువురు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha