Dailyhunt
వివేకా కేసులో సునీతారెడ్డి పోరాటం: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టులో సవాల్

వివేకా కేసులో సునీతారెడ్డి పోరాటం: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టులో సవాల్

వార్త 1 week ago

Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈ కేసులో సీబీఐ చేపట్టిన తదుపరి దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.

Read Also:BJP PVN Madhav: మహిళా బిల్లుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ర్యాలీలు

Viveka Case: పిటిషన్ వెనుక ప్రధాన కారణాలు

వివేకా హత్యకేసులో సీబీఐ తదుపరి దర్యాప్తును కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో తదుప దర్యాప్తు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అనంతరం దర్యాప్తునకు సంబంధించిన అంశం సీబీఐ కోర్టుకు చేరింది. సీబీఐ కోర్టు సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసింది. వివేకా హత్యకేసులో ఏ2గా ఉన్న సునీల్‌ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కరరెడ్డి సోదరుడు ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డిల మధ్య కాల్ డేటాను విశ్లేషించాలని ఆదేశించింది. ఈ కేసులో వారి పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు 2025 డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 Vivekananda Reddy Murder Case

ఈ కేసులో పలువురి పాత్రపై తనకు సందేహాలు ఉన్నాయని.. అందుకే తదుపరి దర్యాప్తు కొనసాగించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో సునీతారెడ్డి కోర్టును కోరారు. సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేసి.. వివేకా హత్యకేసులో సందేహాలుగా ఉన్న కోణాలలో తదుపరి దర్యాప్తు కొనసాగించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. సునీతారెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు మరోసారి సీబీఐ విచారణకు ఆదేశిస్తే వైఎస్ వివేకానందరెడ్డి కేసు మరో మలుపు తిరుగుతుంది అంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు శ్రీకారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha