Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వివో టీ5 5జీ' లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

'వివో టీ5 5జీ' లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

వార్త 2 weeks ago

Vivo T5 5G Launch: టీ5 సిరీస్‌లో వివో కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'వివో టీ5 5జీ'ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. భారీ 7,050mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 3డీ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు 50MP కెమెరా వంటి అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

సెప్టెంబర్‌ 9 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Read Also : iPhone 18 Pro Max: సెప్టెంబర్ 9న యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్!

 'Vivo T5 5G' launched… here are the features and price details!

Vivo T5 5G Launch: వేరియంట్ల వారీగా ధరలు & ఆఫర్లు

వివో టీ5 5జీ రాయల్‌ బ్రాంజ్‌, సిల్వర్‌ గ్రీన్‌ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. కంపెనీ నిర్ణయించిన ధరల వివరాలు:

  • 6GB RAM + 128GB స్టోరేజ్: రూ. 34,999
  • 8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 39,999
  • 8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 44,999
  • 12GB RAM + 256GB స్టోరేజ్ (టాప్‌ వేరియంట్): రూ. 49,999

ఈ ఫోన్‌ కొనుగోలుపై యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో రూ. 4,000 వరకు తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

డిస్‌ప్లే & ప్రాసెసింగ్ పవర్

  • డిస్‌ప్లే: 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే (1260×2800 పిక్సెల్స్). 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, హెచ్‌డీఆర్‌10+ సపోర్ట్ ఉన్నాయి.
  • బాడీ రేటింగ్: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 (IP68), ఐపీ69 (IP69) రేటింగ్స్ ఇచ్చారు.
  • ప్రాసెసర్: 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌, మీడియాటెక్‌ ఎన్‌పీయూ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌, యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్ సాంకేతికతను ఉపయోగించారు.

ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అమర్చారు. OIS సపోర్ట్ ఉన్న 50MP సోనీ ఐఎంఎక్స్‌882 మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ & సాఫ్ట్‌వేర్

ఈ ఫోన్‌లోని 7,050mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22 గంటల పాటు నిరంతర వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీనికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజిన్‌ ఓఎస్‌6 పై ఇది నడుస్తుంది. మూడు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని వివో స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ రంగానికి సమ్మె గండం.. వరుసగా 3 రోజులు బంద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha