Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాదగిరిగుట్ట ఆలయంలో 'జీడిపప్పు పకోడీ' దందా

యాదగిరిగుట్ట ఆలయంలో 'జీడిపప్పు పకోడీ' దందా

వార్త 2 months ago

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో స్వామివారి ప్రసాదం కోసం నిల్వ ఉంచిన చింతపండు చోరీ ఘటన మరువక ముందే, ఇప్పుడు అంతకు మించిన భారీ దందా వెలుగులోకి వచ్చింది.

ప్రసాద తయారీ కోసం వినియోగించే విలువైన జీడిపప్పు, కిస్‌మిస్ వంటి డ్రైఫ్రూట్స్‌ను కొందరు ఉద్యోగులు అడ్డగోలుగా మాయం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి సిబ్బంది ఏకంగా ఆలయ గోదాముల్లోనే తిష్టవేసి, దేవస్థాన సరుకులతోనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం దందాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Read Also : Guntur School Bus Accident: స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

దేవస్థాన గోదాంలోనే ‘పకోడీ’ దందా

ఈ వ్యవహారంలో అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే, నిబంధనలకు విరుద్ధంగా దేవస్థాన గోదాముల్లోనే కిలోల కొద్దీ ‘జీడిపప్పు పకోడీ’ తయారు చేస్తున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులకు అందించే ప్రసాద కవర్లలోనే ఈ పకోడీని ప్యాక్ చేసి, గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఇలా తయారు చేసిన పకోడీలను మరియు దొంగిలించిన డ్రైఫ్రూట్స్‌ను సిబ్బంది తమ ఇళ్లకు తరలించడమే కాకుండా, బయట ఉన్న కొన్ని షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అప్రతిష్ట పాలు కావడానికి అధికారులే కారణమా?

కేవలం డ్రైఫ్రూట్స్ మాత్రమే కాకుండా, ప్రసాద తయారీకి వచ్చే బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యావసర వస్తువులు కూడా క్వింటాళ్ల కొద్దీ పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సుమారు నాలుగు ఏళ్ల కాలంలో భారీ ఎత్తున ఆలయ సంపద దోపిడీకి గురైనట్లు లెక్కలు చెప్తున్నాయి. భక్తులు భక్తితో సమర్పించే కానుకలు, సరుకులను కొందరు సిబ్బంది ఇలా స్వార్థానికి వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ‘పకోడీ గ్యాంగ్’ అక్రమాలపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి, ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు మరియు స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విజయవాడ-హైదరాబాద్ ప్రయాణం ఇక 2 గంటలే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha