Shikshak Cashless Chikitsa Yojana: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు, సామాన్యులతో పాటు ప్రభుత్వ రంగానికి సేవలందిస్తున్న విద్యాశాఖ సిబ్బందికి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు చెప్పింది.
ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్మికులకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో సరికొత్త ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ముఖ్యమంత్రి శిక్షక్ క్యాష్‌లెస్ చికిత్సా సువిధ యోజన’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 12 లక్షల మంది ఉపాధ్యాయులు, విద్యా రంగ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులతో కలిపి ఉచిత వైద్య సదుపాయం లభించనుంది.
Read Also:Hydrogen Train: భారత రైల్వేలో హైడ్రోజన్ యుగానికి శ్రీకారం..ఏమిటి దీని ప్రత్యేకత?
ఏడాదికి రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్యం

ఈ నూతన ఆరోగ్య పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో నమోదైన ప్రభుత్వ ఉపాధ్యాయులు, శిక్షా మిత్రులు (Shiksha Mitras), ఇన్‌స్ట్రక్టర్లు (Instructors), పాఠశాలల్లో పనిచేసే వంట మనుషులు (Cooks), ఇతర అర్హులైన విద్యాశాఖ నాన్-టీచింగ్ సిబ్బందితో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు (Dependents) ఈ పథకానికి అర్హులు. ఈ ఆరోగ్య పథకానికి సంబంధించి ప్రతి లబ్ధిదారునిపై అయ్యే వార్షిక ప్రీమియం సొమ్ము రూ. 3,000లను ఉద్యోగుల నుండి వసూలు చేయకుండా, ఆ భారాన్ని పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
Shikshak Cashless Chikitsa Yojana: లబ్ధిదారులకు ‘క్యాష్‌లెస్ మెడికల్ కార్డ్’
పథకం అమల్లో భాగంగా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘క్యాష్‌లెస్ మెడికల్ కార్డ్’ (Cashless Medical Card) జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్‌లో అడ్మిషన్, ఐసీయూ (ICU) బెడ్లు, శస్త్రచికిత్సలు (Surgeries), అత్యవసర వైద్యం, వైద్య పరీక్షలు, స్పెషలిస్ట్ డాక్టర్ల సంప్రదింపులు మరియు మందులను ఉచితంగా పొందవచ్చు. నిబంధనల ప్రకారం కొన్ని రకాల అవుట్‌పేషెంట్ (OPD) సేవలు కూడా ఇందులో లభిస్తాయి. ఈ పథకం కింద రిజిస్టర్ అయిన అన్ని ప్రభుత్వ మరియు ఎంపానెల్డ్ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయులు వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా సమయానికి నాణ్యమైన వైద్యం అందడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని యూపీ ప్రభుత్వం పేర్కొంది.
Epaper: epaper.vaartha.com

