Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో ఘోర ప్రమాదం.. లారీ-బస్సు ఢీకొని ఐదుగురు మృతి!

యూపీలో ఘోర ప్రమాదం.. లారీ-బస్సు ఢీకొని ఐదుగురు మృతి!

వార్త 23 hrs ago

Uttar Pradesh road accident: ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో నిండి ఉన్న ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సు ఒకటి ఏటా-అలీగంజ్ రోడ్డు మార్గంలో రోడ్డు పక్కన నిలిచి ఉంది.

అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక క్యాంటర్ ట్రక్, నియంత్రణ కోల్పోయి ఆ బస్సును వెనుక భాగం నుంచి బలంగా ఢీకొట్టింది.

Read Also: Basara temple theft: బాసర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

 Horrific accident in UP: Five dead in collision between lorry and bus!

Uttar Pradesh road accident: ఐదుగురు అక్కడికక్కడే మృతి.. 11 మందికి తీవ్ర గాయాలు

ఈ ఘోర ప్రమాద తీవ్రతకు బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన 11 మందిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడైన ట్రక్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ఘట్‌కేసర్ పరిధిలో రైలు కిందపడి దంపతుల ఘోర ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha