Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య

ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య

VIDHATHA 1 week ago

ప్రియురాలు మోసం చేసిందన్న బాధతో హైదరాబాద్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమ, రహస్య వివాహం, బిడ్డ విషయాలను వెల్లడించాడు.

ప్రియురాలు మోసం చేసిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని కొహెడలో చోటుచేసుకుంది. బాధితుడి సెల్ఫీ వీడియోతో ప్రియురాలి మోసం వెలుగు చూసింది. సరిత గౌడ్ అనే యువతి నాలుగేళ్లుగా తనను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుందని, తనతో ఓ ఆడబిడ్డను కూడా కనిందని మృతుడు పల్లపు గోవర్ధన్ రెడ్డి తన సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.

ఇప్పుడు బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైందని..ఈ విషయం తెలిసి కుమిలిపోయిన గోవర్ధన్.. ఎన్ని సార్లు బతిమాలినా తనతో వచ్చేందుకు ఆమె నిరాకరించిందని వీడియోలో వాపోయాడు. నిందితురాలు ఇంకొకరితో ఆమె పెళ్లి పనులను కూడా గోవర్ధన్‌తోనే చేయించుకోవడంతో అతను తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వీడియోలో వెల్లడైంది. తను చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.

తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దు అంటూ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA