Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి జేఏసీ సభ్యుడు రామారావు కన్నుమూత

అమరావతి జేఏసీ సభ్యుడు రామారావు కన్నుమూత

మరావతి, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడు ధనేకుల రామారావు (Amaravati JAC member Dhanekula Ramarao) ఈరోజు (మంగళవారం) కన్నుమూశారు.

ఇవాళ ఉదయం తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నేలపాడులో రామారావు తుది శ్వాస విడిచారు. అమరావతి రైతు ఉద్యమంలో చురుకుగా పాల్గొని రైతులను ముందుండి ఆయన నడిపించారు. రామారావు మృతి పట్ల అమరావతి జేఏసీ సభ్యులు, రాజధాని ప్రాంత రైతులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమరావతి రైతు ఉద్యమంలో న్యాయపోరాటం చేయడంలో రామారావు కీలక పాత్ర పోషించారు. అమరావతి ఉద్యమ నేతగా వైసీపీ హయాంలో 40 రోజుల పాటు ఆయన జైలుకు వెళ్లారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ హైకోర్టులో కేసు వేసి గెలిచిన ఉద్యమ నేతగా రామారావుకు రైతుల్లో మంచిపేరు ఉంది. రాజధాని ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి తిరిగి అమరావతి రాజధానిగా నిలబడే వరకు రైతు నాయకుడు రామారావు పోరాటం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy