Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు.

8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేశామని ప్రస్తావించారు. ధాన్యం రవాణా కోసం 13,000 వాహనాలు వినియోగించామని అన్నారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

అందుబాటులో18.3 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని వివరించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. అబద్దాల రాజకీయాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరని విమర్శించారు. రైతు సంక్షేమంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy