Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం

మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళలతో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.

దీంతో 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్(56*) హాఫ్ సెంచరీతో చెలరేగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది.

ఇంగ్లండ్ బ్యాటర్లు అలిస్ క్యాప్సీ(82), హీథర్ నైట్(70*) అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 76 బంతుల్లో ఏకంగా 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారింది. భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 2, క్రాంతి గౌడ్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేశారు. షెఫాలీ వర్మ(11), స్మృతి మంధాన(8) విఫలమయ్యారు. యాస్తికా భాటియా(32), జెమీమా రోడ్రిగ్స్(29), దీప్తి శర్మ(32) పర్వాలేదనిపించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్(56*), రిచా ఘోష్(6*) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2, లిన్సీ స్మిత్, డీన్ తలొక వికెట్ పడగొట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy