ఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) ప్రకటించారు.
గతంలో కేటాయించిన ఇళ్లకు అదనంగా ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. మొత్తం రెండు కోట్ల ఇళ్లలో ఏపీ, తెలంగాణకు ఐదు లక్షల ఇళ్లను కేంద్రప్రభుత్వం కేటాయించిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఏపీకి మూడు లక్షల ఇళ్లు, తెలంగాణకు రెండు లక్షల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌కి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్ష 75 వేలను కేంద్రం కేటాయిస్తోందని పెమ్మసాని వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కేంద్రప్రభుత్వం లక్ష 75 వేల ఇళ్లను కేటాయిస్తే.. కేవలం 42 వేల ఇళ్లను నిర్మించారని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

