Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గతంలో తారల టంగ్ స్లిప్స్ గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్!

గతంలో తారల టంగ్ స్లిప్స్ గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్!

Chitrajyothy 5 days ago

'ఆట ఆగిందా... ఒక సీటు గోవిందా...' అన్న పాట విన్నాం. ఇప్పుడు 'మాట తూలితే. బాట మారులే.' అంటున్నారు విమర్శకులు. ఇంతకూ ఈ ఆట-మాట-బాట వెనకాల కథేంటి?

నోటిమాటకు ఈ రోజుల్లో విలువే లేదంటారు. కానీ, తారల నోటి మాటలు వినాలని ఆసక్తి ఉన్నవారు మాత్రం ఎందరో ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం!. కానీ, ఎంతో క్రేజ్ ఉన్న తారలు పొరపాటున 'నోరు జారితే' తరువాత జనం నుండి ఎదురయ్యే విమర్శల వెల్లువ తీరును ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం కొత్త పెళ్ళికూతురు రశ్మిక మందణ్ణ అలా ఓ మాట జారి పలు కామెంట్స్ కు తెరలేపారు. ఇంతకూ ఏమిటి సంగతి!?. రశ్మిక మందణ్ణ హిందీ చిత్రం 'కాక్టెయిల్-2'లో నటించారు.ఇందులో షాహిద్ కపూర్ హీరో, ఓ నాయికగా రశ్మిక, మరో హీరోయిన్ గా కృతి సనన్ నటించారు. ఈ మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముంబైలో 'కాక్టెయిల్-2' మీడియా మీట్ సాగింది. ఈ వేడుకలోనే రశ్మిక మాట్లాడుతూ తన కో-స్టార్ కృతి సనన్ అందాన్ని పొగిడేశారు. ఆ పొగడ్తలోనే అనుకోకుండా 'ఎఫ్' లాంగ్వేజ్ ను ఉపయోగించారు రశ్మిక. ఆమె లాంటి అందాల తార నోట 'ఎఫ్' తో మొదలయ్యే ఇంగ్లిష్ బూతుపదం రావడంపై జనం ముక్కున వేలేసుకున్నారు.

అప్పట్లో సమంత....

రశ్మిక అందాల నాయికే అయినా, రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇప్పటి దాకా ఆమె తన సహచర నటీనటులను పొగిడినా, అందులో ఓ చందం ఉండేది. ఎందువల్లో 'కాక్టెయిల్ -2' మీడియా మీట్ లో రశ్మిక టంగ్ స్లిప్పయింది. వెంటనే ఆమె తడుముకొని 'సెన్సార్.సెన్సార్.' అంటూ అరిచారు. అలాగే అక్కడే 'సారీ' కూడా చెప్పారు. అయినా జనం ఊరుకుంటారా?.. గతంలో ఇలా మాట జారిన అందాల భామలను గుర్తు చేసుకుంటున్నారు. ఓ సినిమా వేడుకలో సమంత కూడా 'సక్సెస్'అనబోయి చప్పున 'సెక్స్' అనడం అప్పట్లో సోషల్ మీడియాలో భలే సందడి చేసింది.

'ఎఫ్'తో మొదలయ్యే బూతుపదాన్ని ఇంగ్లిష్ భాషలో కోపం వచ్చినప్పుడు విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. లేదా ఆ పదాన్ని తమకు ఇష్టమైన వారిని విపరీతంగా అభిమానించినప్పుడూ వాడుతుంటారు. అలాగే కృతి సనన్ అందాన్ని పొగిడేస్తూ రశ్మిక ఉపయోగించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అలా రశ్మిక నోట ఆ మాట విని కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు. ఒకప్పుడు అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం ఓ ఇంటర్వ్యూలో చప్పున 'మీ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తుంటారని' అందరూ అడుగుతుంటారు అంటూ చెప్పారు. చప్పున ఆమె కూడా 'సక్సెస్' బదులు 'సెక్స్' అనే మాట అనేశారు. ఇంకేముంది రసికశిఖామణులు రెచ్చిపోయారు. 'సక్సెస్'ను తప్పుగా పలకడం కాదు కానీ, 'ఎఫ్'వర్డ్ ను చప్పున రశ్మిక ఉపయోగించడమే పలు కామెంట్స్ కు దారి తీసింది. ఏది ఏమైనా ఎందరో అందాల భామలు గతంలో 'ఇంగ్లిష్'లో మాట్లాడుతూ తప్పుడు పదాలను వల్లించిన సందర్భాలు ఉన్నాయి. వారందరూ ట్రోల్స్ కూ గురయ్యారు. అందాల తారలూ... తస్మాత్ జాగ్రత్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy