Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా'!

జూలైలో 'వెంకట్రామయ్యగారి తాలూకా'!

Chitrajyothy 5 days ago

టీవీ ప్రభాకర్‌ (ETV Prabhakar) నటుడే కాదు దర్శక నిర్మాత కూడా. ఆయన పిల్లలు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటనను వృత్తిగా ఎంచుకున్నారు. ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్‌ (Chandrahaas) 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. అయితే నటన కంటే కూడా తన యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్‌. తాజాగా ప్రభాకర్ కుమార్తె దివిజ (Divija) కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తొలి చిత్రం 'వెంకట్రామయ్యగారి తాలూకా' షూటింగ్‌ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. అలానే 'హే చికితా' మూవీలోనూ దివిజ హీరోయిన్‌గా నటించింది.

దివిజ ప్రభాకర్ హీరోయిన్‌ గా నటిస్తున్న 'వెంకట్రామయ్యగారి తాలూకా' సినిమాను సతీశ్‌ ఆవాల దర్వకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించారు. దినేశ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమా గురించి నిర్మాత కోమలి మాట్లాడుతూ, 'ఫోక్ సింగర్‌గా నాకంటూ ఓ గుర్తింపు ఉంది. సినిమా రంగం మీద మక్కువతో నిర్మాతగా నా ప్రయాణం మొదలు పెట్టాను. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశారు. వచ్చే నెలలో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నాం' అని అన్నారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, 'అందమైన ఒక పల్లెటూరులో వెంకట్రమయ్య అనే వ్యక్తి కుటుంబంలో జరిగే కథ ఇది. పరువుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఆయన. అయితే అతని కుటుంబంలోని వ్యక్తుల మధ్య బంధాలన్నీ డబ్బు ఆధారంగా కొనసాగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కని, పెంచి పెద్ద చేస్తే... చివరి దశలో ఆ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి చూస్తున్నాం. ఈ సినిమాలో తల్లిదండ్రుల గొప్పతనం చూపించబోతున్నాం' అని అన్నారు. ఇందులో మురళీధర్ గౌడ్, సుధ, కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూ ముంజేటి, హాసిని, యామిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ దీనికి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy