Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!

Chitrajyothy 6 days ago

టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ హీరోగా దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ, రీసెంట్‌గా రియల్ లైఫ్‌లోనూ సూపర్ హీరో అనిపించుకున్నారు.

తన లైఫ్ పార్ట్‌నర్ రష్మిక మందన్న (Rashmika Mandanna)తో కలిసి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 180 మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటుకుంటూ విజయ్ చేసిన ఈ మంచి పనికి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఖాతాలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డ్ చేరింది. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్' (Liger) సినిమా కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్.. ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ స్టార్‌తో తలపడబోతున్నారు. 'ది మమ్మీ' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) విజయ్ కొత్త సినిమాలో నటించబోతున్నారు. ఇలా ఇద్దరు హాలీవుడ్ లెజెండ్స్‌తో కలిసి పనిచేసిన తెలుగు హీరోగా విజయ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రణబాలి' (Ranabaali) చిత్రంలోనే ఈ గ్లోబల్ మ్యాజిక్ జరగబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. వివాహం తర్వాత ఈ క్రేజీ కపుల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా కావడంతో 'రణబాలి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ మార్కెట్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు 'పెద్ది' సారొ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy