Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు!

కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు!

Chitrajyothy 3 weeks ago

యంగ్ హీరో నార్నే నితిన్ (Narne Nithiin) ఇప్పుడో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డి (Radha Krishna Reddy)తో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఆయన జతకట్టారు.

నార్నే నితిన్ 5వ చిత్రం (NN5)గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ (Venkat K Narayana) నిర్మిస్తుండగా.. లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా ఈ చిత్రం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను ఆన్ చేశారు. 'MAD' చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించగా, వెంకట్ కె నారాయణ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణకు అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కెవిఎన్ ప్రొడక్షన్స్ విషయానికి వస్తే.. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ.. దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఈ సంస్థ గుర్తింపు పొందింది. తమిళంలో 'జననాయగన్' చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ.. తెలుగులో పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్‌లో భాగమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న 'మెగా158' చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇలా అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్‌ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తోంది.

ఇక ఇందులో నార్నే నితిన్ సరికొత్తగా కనిపించనుండగా, ఆయన సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. అనికా సురేంద్రన్, మేఘా శెట్టి ఇందులో హీరోయిన్లు. ఈ చిత్రానికి ట్యాలెంటెండ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతంతో ప్రశంసలు పొందిన వివేక్ అండ్ మెర్విన్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్‌, శివ కామేష్ డి ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రొమాన్స్, కామెడీ, మనసుని హత్తుకునే భావోద్వేగాల కలయికతో బలమైన ఎమోషనల్ అంశాలతో కూడిన కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ 'ఫౌజీ' రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో 'గాడ్ ఆఫ్ వార్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy