Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ 'ఫౌజీ' రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

ప్రభాస్ 'ఫౌజీ' రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

Chitrajyothy 3 weeks ago

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఫౌజీ' (Fauzi).

ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చరిత్ర ఆధారంగా సాగే ఈ కథలో యుద్ధం, ప్రేమ అనే రెండు బలమైన అంశాలను దర్శకుడు అత్యంత ఆకర్షణీయంగా చూపించబోతున్నారని సమాచారం. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారట. ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌ను అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హను రాఘవపూడి కెరీర్‌లోనే ఇది అత్యధిక వ్యయంతో రూపొందుతున్న సినిమా కావడం విశేషం. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మేకర్స్ పని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా, ఈ మూవీకి సంబంధించి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) పంచుకున్న ఒక క్రేజీ అప్‌డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మైత్రి నిర్మాత రవిశంకర్ తనకు 'ఫౌజీ' సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూపించారని, అవి చూశాక తన మైండ్ బ్లాక్ అయిందని పేర్కొన్నారు. చిత్రయూనిట్ ఈ సినిమాను మనం ఊహించని రేంజ్‌లో, ఒక సరికొత్త హాలీవుడ్ లెవెల్‌లో తెరకెక్కిస్తోందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించి, అఫీషియల్ టీజర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతుండటం గమనార్హం. బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ లాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అద్భుతమైన మెలోడీలను అందించే విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వీరందరి కలయికలో వస్తున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో 'గాడ్ ఆఫ్ వార్'

ప్రభాస్‌తో 'ధురంధర్' దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy