మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'పెద్ది' (Peddi Movie).
ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి ఫ్యాన్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ సోమవారం సాయంత్రం 'పెద్ది' ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ దూసుకెళుతోంది. ముఖ్యంగా, ట్రైలర్‌లోని ఒక ప్రత్యేకమైన యాక్షన్ షాట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. రామ్ చరణ్ అత్యంత ఉద్వేగంతో, తనదైన శైలిలో ప్రత్యర్థిపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న ఈ సన్నివేశం సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.
ట్రైలర్ అంతా ఒక ఎత్తు, లాస్ట్‌లో వచ్చే ఈ ట్రాన్సిషన్ షాట్ మరో ఎత్తు అనేలా ఫ్యాన్స్, నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. క్రికెటర్ నుంచి కుస్తీ యోధుడిగా మారడం మాత్రం హైలెట్ అంటూ.. బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, ఈ షాట్‌కు నీకు గుడి కూడా కట్టేయవచ్చు బుచ్చి అంటూ ఫ్యాన్స్ కొందరు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్, అతని శారీరక భాష, యాక్షన్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ట్రైలర్‌లోని చాలా వరకు షాట్స్.. బుచ్చి బాబు సానా దర్శకత్వ ప్రతిభను కొనియాడేలా చేస్తున్నాయి.

