- ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
- ప్రస్తుత సీజే (CJ) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.
- ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
- ఈమె ప్రస్తుతం పంజాబ్ & హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
- B.A. LL.B, LL.M పూర్తి చేశారు.
- 1990లో న్యాయవాదిగా (Advocate) ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
- 2014 మార్చిలో పంజాబ్ & హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
- 2015లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
- భారతదేశంలో న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను 'కొలీజియం' (Supreme Court Collegium) నిర్ణయిస్తుంది. ఇందులో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) తో పాటు సుప్రీంకోర్టులోని మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
- కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువడుతాయి. అప్పుడే ఆమె ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(25.02.2026) తెలుగులో..
అమ్మాయిలందరికీ ఫ్రీగా HPV వ్యాక్సిన్..ఎందుకు..అసలేంటీ వ్యాక్సిన్..?
ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాల పేర్లు మారాయో తెలుసా..?
ఒక్క ఇంజెక్షన్ ₹16 కోట్లా..ఎందుకంత కాస్ట్..అసలేంటీ మహమ్మారి? చికిత్స అందకపోతే ఏమవుతుంది?
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(24.02.2026) తెలుగులో..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

