- ఇందులో సుమారు 38% కేసులు ఇన్ఫెక్షన్లు (అంటువ్యాధులు), జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల సంభవించాయని అంచనా. ఇవన్నీ నివారించదగినవే.
- హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో టీకాలు వేయడం ద్వారా అడ్డుకోవచ్చు.
- అలాగే స్మోకింగ్ వల్ల కలిగే అనేక కణితులను ధూమపానం మాన్పించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి 'శక్తివంతమైన అవకాశం'ఉందని పరిశోధకులు అంటున్నారు.
- వయసు పెరిగే కొద్దీ మన డీఎన్‌ఏలో అనివార్యంగా జరిగే నష్టం లేదా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువులు వారసత్వంగా రావడం వల్ల కొన్ని క్యాన్సర్లు అనివార్యం.
- అయితే 10లో దాదాపు నాలుగు కేసులను నివారించవచ్చన్న అంశం జనంలో ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
- క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించగల కారకాలను డబ్ల్యూహెచ్‌ఓలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ విశ్లేషించింది.
- ధూమపానం, అతినీలలోహిత (అల్ట్రావయోలెట్) కిరణాలు వీటిలో ఉన్నాయి. ఇవి మన డీఎన్‌ఏను నేరుగా దెబ్బతీస్తాయి.
- ఊబకాయం, శరీరంలో వాపు, హార్మోన్లను మార్చే అతి తక్కువ శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. వాయు కాలుష్యం వల్ల నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మేల్కొంటాయని ఏజెన్సీ వెల్లడించింది.
- క్యాన్సర్‌కు దారితీసే తొమ్మిది ఇన్ఫెక్షన్లను కూడా ఏజెన్సీ నివేదించింది. వీటిలో హెచ్‌పీవీ, కాలేయ క్యాన్సర్‌కు దారితీసే హెపటైటిస్ వైరస్‌లు, కడుపు నొప్పి, అల్సర్స్, తీవ్రమైన గ్యాస్ సమస్యలకు కారణం అయ్యే హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నాయి.
- పరిశోధన బృందం 2022 నుండి 36 రకాల క్యాన్సర్ కేసుల డేటాను.. అలాగే 185 దేశాలలో 2012-22 మధ్య ఈ వ్యాధికి మూలమైన 30 ప్రమాద కారకాల సమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించింది.
- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులకు ధూమపానం ప్రధాన కారణమని వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫెక్షన్లు, మద్యపానం ఉన్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రమాద కారకాలను నివారించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి అని పరిశోధన వెల్లడించింది.
- పురుషుల క్యాన్సర్లలో 45% నివారించదగినవిగా ఉండగా.. మహిళల్లో ఇది 30% ఉంది. నివారణ స్థాయి పురుషులలో అధిక స్థాయిలో ఉండడానికి కారణం.. ధూమపాన ప్రియులు పురుషుల్లో ఎక్కువగా ఉండడమే.
- యూరప్‌లో నివసించే మహిళల్లో క్యాన్సర్ దరి చేరకుండా ఫుల్‌స్టాప్ పెట్టే మొదటి మూడు కారణాల్లో ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం ఉన్నాయి. సబ్-సహారా ఆఫ్రికాలో మహిళల్లో నివారించగల క్యాన్సర్లలో ఇన్ఫెక్షన్ల వాటా దాదాపు 80% ఉంది.
- అంటే ఈ క్యాన్సర్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలు ప్రతి ప్రాంతం లేదా దేశానికి అనుగుణంగా ఉండాలని నివేదిక వివరించింది.
- నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం ధూమపానం, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్‌తో ముడిపడి కడుపు క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్‌తో గర్భాశయ క్యాన్సర్.. నివారించగల మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు సగం ఉంటాయి.
- ధూమపానం నియంత్రణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో క్యాన్సర్ కేసులు తగ్గాయని నివేదిక తెలిపింది. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అతిపెద్ద ముప్పుగా పరిణమించింది.
- నివేదిక ప్రకారం.. మహిళల్లో 92 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 30% నివారించవచ్చు.
- సబ్ సహారా ఆఫ్రికా వంటి తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో సరై్వకల్ క్యాన్సర్ కేసులు అధికం.
- అధిక ఆదాయ దేశాలైన ఉత్తర అమెరికా, యూరప్‌లో మహిళల్లో క్యాన్సర్‌కు స్మోకింగ్ ప్రధాన కారణం.
- పురుషుల్లో 43 లక్షల నివారించదగ్గ క్యాన్సర్ కేసుల్లో 25% ధూమపానం కారకంగా నిలిచింది.
- ఇన్ఫెక్షన్‌తో కూడిన క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో ఎక్కువ.
a) హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) 1) కాలేయ క్యాన్సర్
b) హెపటైటిస్ వైరస్ 2) గర్భాశయ క్యాన్సర్
c) హెలికోబాక్టర్ పైలోరి 3) ఊపిరితిత్తుల క్యాన్సర్
d) వాయు కాలుష్యం 4) కడుపు క్యాన్సర్
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A) a-2, b-1, c-4, d-3
B) a-1, b-2, c-3, d-4
C) a-2, b-4, c-1, d-3
D) a-4, b-3, c-2, d-1
A) ఊబకాయం
B) ధూమపానం
C) శారీరక శ్రమ లేకపోవడం
D) అతినీలలోహిత కిరణాలు
A) హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
B) ధూమపానం మాన్పించడం
C) యాంటీబయోటిక్స్ అధికంగా వాడటం
D) వాయు కాలుష్య నియంత్రణ
A) నివారించదగిన క్యాన్సర్లు
B) అనివార్యమైన క్యాన్సర్లు
C) ఇన్ఫెక్షన్ క్యాన్సర్లు
D) జీవనశైలి క్యాన్సర్లు
A) సాల్మొనెల్లా
B) హెలికోబాక్టర్ పైలోరి
C) ఈ-కోలి
D) స్ట్రెప్టోకోకస్
A) యునిసెఫ్ (UNICEF)
B) వరల్డ్ బ్యాంక్
C) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
D) యునెస్కో (UNESCO)
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

