Dailyhunt
PM RAHAT పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి..ఎవరు అర్హులు..?

PM RAHAT పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి..ఎవరు అర్హులు..?

SAKSHI EDUCATION 2 months ago
  • ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రమాద బాధితులు ముందుగా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
  • గోల్డెన్ అవర్ (Golden Hour): ప్రమాదం జరిగిన మొదటి గంటలో ప్రాణాలను కాపాడటమే ఈ పథకం లక్ష్యం.
  • నగదు రహిత చికిత్స: దేశంలోని ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగినా, సమీపంలోని నెట్‌వర్క్ ఆసుపత్రికి వెళ్తే 1.5 లక్షల రూపాయల వరకు ఎటువంటి డబ్బు కట్టకుండానే (Cashless) చికిత్స అందిస్తారు.
  • భారత పౌరులందరికీ: రహదారి ప్రమాదాలకు గురైన భారతీయ పౌరులందరూ దీనికి అర్హులు.
  • గుర్తింపు కార్డు: ఆసుపత్రిలో చేరిన తర్వాత మీ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. ఒకవేళ బాధితుడు అపస్మారక స్థితిలో ఉంటే, తదుపరి చికిత్స సమయంలో కుటుంబ సభ్యులు వివరాలు అందజేయవచ్చు.
  • ఆయుష్మాన్ భారత్ (PM-JAY) పథకం కింద నమోదైన ఆసుపత్రులన్నీ పీఎం రాహత్ పథకం కింద చికిత్స అందించాల్సి ఉంటుంది.
  • హైవేల వెంబడి ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ ట్రామా సెంటర్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటాయి.
  • బాధితులకు చికిత్స అందించిన తర్వాత, ఆ ఖర్చులను ఆసుపత్రులు నేరుగా ప్రభుత్వం నుండి పొందుతాయి. దీని కోసం బాధితుడు ఎటువంటి ఫారమ్ నింపాల్సిన పని లేదు. ఆసుపత్రి యాజమాన్యమే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటుంది.
  • ఈ పథకం నేటి(ఫిబ్రవరి, 14) నుండే ప్రారంభమైనందున, త్వరలోనే దీని కోసం ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ మరియు మొబైల్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
  • దీని ద్వారా మీకు దగ్గరలో ఉన్న 'రాహత్' ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు.
  • ప్రధానమంత్రి రాహత్ (PM RAHAT - Relief Assistance for Highway Accident Trauma)పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది.
  • ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.
  • ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.
  • బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది.
  • ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.'గోల్డెన్ అవర్'లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

1. ఈ పథకం కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది.
2. ఈ పథకం కేవలం జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది.
పై వాటిలో సరైన ప్రకటన ఏది?
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) ఏదీ కాదు

A) ప్రమాదానికి ముందే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి
B) ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ప్రత్యేక ఫారమ్ నింపాలి
C) ఎటువంటి ముందస్తు దరఖాస్తు అవసరం లేదు (ఆటోమేటిక్ ఎన్‌రోల్‌మెంట్)
D) కేవలం బిపిఎల్ (BPL) కార్డు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి

A) ప్రభుత్వం నిధులు విడుదల చేసే సమయం
B) ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలను కాపాడగలిగే అత్యంత కీలకమైన మొదటి గంట
C) ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే మొదటి 24 గంటలు
D) ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి పట్టే సమయం

A) Relief Assistance for Highway Accident Trauma
B) Road Accident Health Aid Team
C) Rapid Assistance for Highway Action Task
D) Roadway Accident Help and Trauma

A) ఇది భారత పౌరులందరికీ వర్తిస్తుంది.
B) దీని ద్వారా చికిత్స ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభమవుతుంది.
C) ఆసుపత్రి బిల్లులు బాధితులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు.
D) ఈ పథకం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం.

A) కేంద్ర రక్షణ శాఖ
B) కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ & రోడ్డు రవాణా శాఖ
C) కేంద్ర హోం శాఖ
D) కేంద్ర ఆర్థిక శాఖ

a) నగదు రహిత పరిమితి 1) ప్రాణాలు కాపాడే మొదటి గంట
b) గోల్డెన్ అవర్ 2) రూ. 1.5 లక్షలు
c) పీఎం రాహత్ ఆఫీస్ 3) ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రులు
d) అమలు చేసే నెట్‌వర్క్ 4) సేవా తీర్థ
సరైన కోడ్ ను ఎంచుకోండి:
A) a-2, b-1, c-4, d-3
B) a-1, b-2, c-3, d-4
C) a-4, b-3, c-2, d-1
D) a-3, b-4, c-1, d-2

A) అతిథి దేవో భవ
B) నాగరిక్ దేవో భవ
C) మాతృదేవో భవ
D) ఆచార్య దేవో భవ

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education