- జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి రాష్ట్రపతి 'ప్రచండ్' హెలికాప్టర్ లో సుమారు 25 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తారు.
- ఒక భారత రాష్ట్రపతి యుద్ధ హెలికాప్టర్‌లో కో-పైలట్‌గా సరిహద్దు గగనతలంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి.
- ఈ పర్యటనలో భాగంగా ఆమె జైసల్మేర్ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలిస్తారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ అధికారులతో మరియు ఎయిర్ వారియర్స్‌తో ముచ్చటిస్తారు.
- సాయంత్రం పోఖ్రాన్ పరిధిలోని చందన్ ప్రాంతంలో జరిగే వైమానిక దళ అతిపెద్ద ఫైర్‌పవర్ ప్రదర్శన 'వాయు శక్తి'కి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.
- ఈ విన్యాసాల్లో 77 యుద్ధ విమానాలు, 43 హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. సుమారు 12,000 కిలోల మందుగుండు సామగ్రిని ఉపయోగించి IAF తన మల్టీ-ఫ్రంట్ ఆపరేషన్ సామర్థ్యాన్ని చాటిచెప్పనుంది.
- ముర్ము గారు గతంలో కూడా భారత వైమానిక దళ విమానాల్లో ప్రయాణించి రక్షణ రంగంపై తనకున్న ప్రత్యేక ఆసక్తిని చాటుకున్నారు:
- 29 అక్టోబర్ 2025 న రఫేల్ (Rafale) విమానంలో ప్రయాణించి రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో (రఫేల్, సుఖోయ్) తొలి భారత రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు.
- 8 ఏప్రిల్ 2023న సుఖోయ్ (Su-30 MKI)లో అస్సాంలోని తేజ్‌పూర్ నుండి హిమాలయ శ్రేణులపై ప్రయాణించారు. ప్ర తిభా పాటిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతి.
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా, రాష్ట్రపతి ఇలాంటి విన్యాసాల్లో పాల్గొనడం దేశ రక్షణ దళాల నైతిక బలాన్ని పెంపొందించడంలో కీలకంగా మారుతుంది.
i) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జైసల్మేర్‌లో 'ప్రచండ్' హెలికాప్టర్‌లో ప్రయాణించారు.
ii) యుద్ధ హెలికాప్టర్‌లో కో-పైలట్‌గా ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతి ఈమే.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A) i మాత్రమే
B) ii మాత్రమే
C) i మరియు ii రెండూ
D) ఏదీ కాదు
A) దీనిని DRDO అభివృద్ధి చేసింది.
B) ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో (High Altitude) ల్యాండ్ మరియు టేకాఫ్ చేయగల ఏకైక అటాక్ హెలికాప్టర్.
C) ఇది కేవలం రవాణా అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే హెలికాప్టర్.
D) దీనిని రష్యా సహకారంతో భారత్ నిర్మించింది.
1. సుఖోయ్ Su-30 MKI — (ఎ) అంబాలా (గోల్డెన్ ఆరోస్)
2. రఫేల్ (Rafale) — (బి) జైసల్మేర్
3. ప్రచండ్ (LCH) — (సి) తేజ్‌పూర్ (అస్సాం)
సరైన ఎంపిక:
A) 1-ఎ, 2-బి, 3-సి
B) 1-సి, 2-ఎ, 3-బి
C) 1-బి, 2-సి, 3-ఎ
D) 1-సి, 2-బి, 3-ఎ
A) దీనిని ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసింది.
B) రాష్ట్రపతి ముర్ము 2025 అక్టోబర్‌లో ఇందులో ప్రయాణించారు.
C) ఇది 5వ తరం (5th Generation) యుద్ధ విమానం.
D) ఇది ట్విన్-ఇంజిన్ కలిగిన మల్టీరోల్ యుద్ధ విమానం.
5. భారత సాయుధ దళాల 'సుప్రీం కమాండర్' గా రాష్ట్రపతికి ఉండే అధికారాల గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ పేర్కొంటుంది?
A) అధికరణ 52
B) అధికరణ 53(2)
C) అధికరణ 72
D) అధికరణ 74
అమ్మాయిలందరికీ ఫ్రీగా HPV వ్యాక్సిన్..ఎందుకు..అసలేంటీ వ్యాక్సిన్..?
ఒక్క ఇంజెక్షన్ ₹16 కోట్లా..ఎందుకంత కాస్ట్..అసలేంటీ మహమ్మారి? చికిత్స అందకపోతే ఏమవుతుంది?
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

