దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో ఈ గేయాలాపనను తప్పనిసరి చేస్తూనే, పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని స్పష్టం చేసింది.
- బంకిం చంద్ర ఛటర్జీ రాసిన అసలు మూల గేయంలోని మొత్తం ఆరు (6) చరణాలను ఆలపించడం ఇకపై తప్పనిసరి.
- గేయాలాపన మొత్తం సమయం 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించబడింది.
- 1937లో తొలగించిన చివరి నాలుగు చరణాలను తిరిగి అధికారిక వెర్షన్‌లో చేర్చారు.
- అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకలు మరియు పౌర పురస్కారాల (ఉదా: పద్మ అవార్డులు) సభల్లో తప్పనిసరిగా ఆలపించాలి.
- రాష్ట్రపతి లేదా గవర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యే కార్యక్రమాల్లో వారు వచ్చినప్పుడు మరియు వెళ్లేటప్పుడు (Arrival and Departure).
- అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం (జనగణమన) ముగిసిన వెంటనే 'వందేమాతరం' ఆలపించడం ఇకపై తప్పనిసరి.
- దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉదయపు ప్రార్థన (Morning Assembly) సమయంలో విద్యార్థులందరూ సమూహంగా పాడాలి.
- ఆకాశవాణి, దూరదర్శన్‌లలో రాష్ట్రపతి ప్రసంగానికి ముందు మరియు తర్వాత దీనిని ప్రసారం చేస్తారు.
- గేయం ఆలపిస్తున్నప్పుడు లేదా ప్లే అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవసూచకంగా తప్పనిసరిగా నిలబడాలి(Attention Pose).
- గేయానికి ముందు మృదంగం, ట్రంపెట్ లేదా డ్రమ్ రోల్ వంటి వాయిద్యాలతో సూచన ఇవ్వాలి. మార్చింగ్ డ్రిల్‌లో అయితే 7 అడుగుల తర్వాత గేయం మొదలవ్వాలి.
- సినిమా థియేటర్లలో సినిమా లేదా వార్తా రీల్స్ మధ్యలో వందేమాతరం ప్లే చేసినప్పుడు నిలబడటం తప్పనిసరి కాదు.
- జాతీయ గీతంతో (National Anthem) సమానంగా జాతీయ గేయానికి (National Song) గౌరవం కల్పించడం ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశ్యం.
- ఇది రాజకీయ నిర్ణయం కాదని, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించే చర్య అని ప్రభుత్వం పేర్కొంది.
- చరణాల పునరుద్ధరణ మతపరమైన లేదా రాజకీయ దుమారానికి దారితీయవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
- ఈ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు లేదా ప్లే చేస్తున్నప్పుడు దేశ పౌరులందరూ గౌరవసూచకంగా నిలబడాలి.
- పూర్తి గేయాలాపన (6 చరణాలు): ఇప్పటివరకు వందేమాతరంలో కేవలం కొన్ని భాగాలనే పాడేవారు. అయితే, ఇకపై గేయంలోని మొత్తం ఆరు చరణాలను కచ్చితంగా ఆలపించాలని కేంద్రం ఆదేశించింది.
- గమనిక: 1937లో తొలగించిన చివరి నాలుగు చరణాలను తిరిగి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది.
- రాష్ట్రపతి కార్యక్రమాలు: రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక వేడుకల్లో ఆయన రాక సందర్భంలోనూ, వీడ్కోలు సమయంలోనూ వందేమాతరం వినిపిస్తుంది.
- పౌర పురస్కారాలు: పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక వేడుకల్లో కూడా ఈ గేయాలాపన అంతర్భాగం కానుంది.
- సినిమా థియేటర్లకు మినహాయింపు: సామాన్య ప్రజల సౌకర్యార్థం సినిమా థియేటర్లలో వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ ప్లే చేసినా, నిలబడటం తప్పనిసరి కాదు.
- దేశ విభజన సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం గత పాలకులు గేయ చరణాలను తొలగించారని, ఇప్పుడు వాటిని చేర్చడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నామని కేంద్రప్రభుత్వం పేర్కొంటోంది.
- పూర్తి గేయాన్ని కచ్చితంగా పాడాలనే నిబంధన మతపరమైన విభజనకు దారితీసే అవకాశం ఉందని, ఇది కేవలం రాజకీయ దుమారం కోసమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో అగ్ని కీలగా పనిచేసిన 'వందేమాతరం' గేయానికి, జాతీయ గీతంతో సమానమైన హోదా కల్పిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
i. ఈ మార్గదర్శకాలను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ii. గేయాలాపన మొత్తం సమయం 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించబడింది.
iii. జాతీయ గీతం (జనగణమన) కంటే ముందే వందేమాతరం ఆలపించడం తప్పనిసరి.
A. i మరియు ii మాత్రమే
B. ii మాత్రమే
C. i మరియు iii మాత్రమే
D. పైవన్నీ
A. అసలు మూల గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం ఇకపై తప్పనిసరి.
B. 1937లో తొలగించిన చివరి నాలుగు చరణాలను తిరిగి అధికారిక వెర్షన్‌లో చేర్చారు.
C. బంకిం చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని ఆనందమఠ్ నవలలో రాశారు.
D. కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా పరిగణించాలని 2026 ఉత్తర్వు పేర్కొంది.
A. రాష్ట్రపతి రాక సమయంలో (Arrival) మాత్రమే.
B. రాష్ట్రపతి వెళ్లే సమయంలో (Departure) మాత్రమే.
C. రాక మరియు వెళ్లే సమయాల్లో (Both Arrival and Departure).
D. కేవలం రాష్ట్రపతి ప్రసంగం మధ్యలో.
i. ఈ మార్గదర్శకాలు గేయం సృష్టించబడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విడుదలయ్యాయి.
ii. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో రాష్ట్రపతి ప్రసంగానికి ముందు మరియు తర్వాత దీనిని ప్రసారం చేస్తారు.
iii. అన్ని విద్యా సంస్థల్లో ఉదయపు ప్రార్థనలో సమూహంగా పాడటం తప్పనిసరి.
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A. i మరియు ii మాత్రమే
B. ii మరియు iii మాత్రమే
C. i మరియు iii మాత్రమే
D. i, ii మరియు iii
A. గేయాన్ని పూర్తిగా నిషేధించారు.
B. చివరి నాలుగు చరణాలను తొలగించారు.
C. గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
D. గేయానికి ట్యూన్ మార్చారు.
i. గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ రాక మరియు వెళ్లే సమయంలో గేయం ఆలపించాలి.
ii. కేవలం ముఖ్యమంత్రి హాజరైనప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
సరైనది ఏది?
A. i మాత్రమే
B. ii మాత్రమే
C. i మరియు ii
D. ఏదీ కాదు
A. మృదంగం
B. ట్రంపెట్
C. డ్రమ్ రోల్
D. వీణ
A. రవీంద్రనాథ్ ఠాగూర్ - గీతాంజలి
B. బంకిం చంద్ర ఛటర్జీ - ఆనందమఠ్
C. శరత్ చంద్ర ఛటర్జీ - దేవదాస్
D. మహమ్మద్ ఇక్బాల్ - సారే జహాఁ సే అచ్చా
A. వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ 'అటెన్షన్ పోజ్'లో ఉండాలి.
B. 2026 మార్గదర్శకాల ప్రకారం గేయం 2 నిమిషాల్లో ముగియాలి.
C. పౌర పురస్కారాల వేడుకల్లో ఇది అంతర్భాగం.
D. ఈ నిర్ణయంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here

