- అనంతరం 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో హైదరాబాద్ రాష్ట్రం విలీనమై 'ఆంధ్రప్రదేశ్'గా అవతరించినప్పుడు, హైకోర్టు తన కార్యస్థానాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది.
- సుమారు ఆరు దశాబ్దాల పాటు అక్కడి నుండే కార్యకలాపాలు సాగించింది.
- 2014 రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్ల పాటు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగినప్పటికీ, చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 1, 2019న నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పునఃస్థాపితమైంది.
- నేడు అమరావతిలోని 'మధ్యంతర న్యాయ సముదాయం' నుండి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంగా ఇది సేవలు అందిస్తోంది.
- 1953లో పూర్వపు మద్రాసు రాష్ట్రం నుండి 11 తెలుగు జిల్లాలు (శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప మరియు చిత్తూరు) విడిపోయి 'ఆంధ్ర రాష్ట్రం'గా ఏర్పడ్డాయి.
- 1954లో గుంటూరు ప్రధాన కేంద్రంగా ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైంది.
- అప్పట్లో 7గురు న్యాయమూర్తులతో ప్రారంభమైన ఈ కోర్టుకు జస్టిస్ కోకా సుబ్బారావు గారు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
- 1956లో హైదరాబాద్ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం విలీనమై 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రం ఏర్పడింది.
- హైకోర్టు ప్రధాన కేంద్రం గుంటూరు నుండి హైదరాబాద్‌కు మారింది.
- 11 మంది న్యాయమూర్తులతో ఈ కోర్టు పనిచేసేది. జస్టిస్ కోకా సుబ్బారావు గారే ఈ నూతన హైకోర్టుకు కూడా మొదటి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు.
- 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. జూన్ 2, 2014 నుండి హైదరాబాద్‌లోని హైకోర్టు రెండు రాష్ట్రాలకు 'ఉమ్మడి హైకోర్టు'గా సేవలు అందించింది.
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడింది.
- జనవరి 1, 2019 నుండి అమరావతి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన కార్యకలాపాలను ప్రారంభించింది.
- ప్రారంభంలో 14 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన ఈ కోర్టుకు జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ గారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
ఫిబ్రవరి 3, 2019న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ గారు అమరావతిలోని 'మధ్యంతర న్యాయ సముదాయాన్ని' (Interim Judicial Complex) ప్రారంభించారు. మార్చి 18, 2019 నుండి హైకోర్టు పూర్తిస్థాయిలో ఇక్కడి నుండే పనిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)గా జస్టిస్ లీసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే (CJ) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అమ్మాయిలందరికీ ఫ్రీగా HPV వ్యాక్సిన్..ఎందుకు..అసలేంటీ వ్యాక్సిన్..?
ఒక్క ఇంజెక్షన్ ₹16 కోట్లా..ఎందుకంత కాస్ట్..అసలేంటీ మహమ్మారి? చికిత్స అందకపోతే ఏమవుతుంది?
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

