Dailyhunt
శబరిమల వివాదం..మహిళల ప్రవేశంలో కీలక నిర్ణయం..?

శబరిమల వివాదం..మహిళల ప్రవేశంలో కీలక నిర్ణయం..?

SAKSHI EDUCATION 1 month ago

  • గతంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తన పాత వైఖరిని మార్చుకుని, ఇప్పుడు ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది.

  • ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయాన్ని అధికారికంగా వివరించనున్నదని తెలుస్తోంది.
  • రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందంటూ 'మాతృభూమి' తన కథనంలో పేర్కొంది.
  • ఇటీవలే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కూడా శబరిమల పురాతన ఆచారాలను కాపాడాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది.
  • మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌)కు వదిలివేశారు. సీపీఎం నాయకత్వం, ఇతర మిత్రపక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.
  • గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
  • భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ 'రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.
  • ఫలానా వారు ఆలయానికి వెళ్లకూడదని ఏ ఒక్క వర్గం నిర్ణయించలేదు' అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 'శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మా వైఖరిలో మార్పు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటేరియట్ నిర్ణయించింది' అని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ఓటర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు అంటున్నారు.
  • శబరిమల వివాదం ప్రధానంగా అయ్యప్పస్వామి బ్రహ్మచారి రూపంలో ఉంటాడనే నమ్మకంతో 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఉన్న శతాబ్దాల నాటి ఆచారంపై నడుస్తోంది.
  • 1991లో కేరళ హైకోర్టు ఈ నిషేధాన్ని సమర్థించగా, 2018లో సుప్రీంకోర్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున నిరసనలు, చట్టపరమైన సవాళ్లు నేటికీ కొనసాగుతున్నాయి.
  • శబరిమల అయ్యప్ప ఆలయంలో రుతుక్రమం వచ్చే వయస్సు (10-50 ఏళ్లు) గల మహిళలు ప్రవేశించకూడదనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం.
  • 1991 - కేరళ హైకోర్టు తీర్పు: మహిళల ప్రవేశాన్ని నిషేధించిన కేరళ హైకోర్టు, 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఆలయంలోకి వెళ్లకూడదని చట్టబద్ధం చేసింది.
  • 2006 - సుప్రీంకోర్టులో సవాలు: 'ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్' మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది.
  • 2018 - సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు: 28 సెప్టెంబర్ 2018న, సుప్రీంకోర్టు 4:1 మెజారిటీతో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది రాజ్యాంగంలోని 14 (సమానత్వం), 25 (మత స్వేచ్ఛ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
  • 2018-ప్రస్తుతం - నిరసనలు, సమీక్షా పిటిషన్లు: తీర్పు తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. 65కు పైగా సమీక్షా పిటిషన్లు దాఖలయ్యాయి. 2019లో ఈ కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి (7 గురు న్యాయమూర్తులు) రిఫర్ చేసింది.
  • మహిళల ప్రవేశంపై సస్పెన్స్ కొనసాగుతుండగానే, నిరసనలు మరియు రాజకీయ వివాదాలు నేటికీ జరుగుతున్నాయి. ఇటీవల, ఆలయ బంగారం చోరీకి సంబంధించిన వివాదం కూడా తెరపైకి వచ్చింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education